Advertisementt

మహేష్-త్రివిక్రమ్ తప్పు చేస్తున్నారా?

Sun 29th May 2022 09:41 AM
ssmb28,mahesh babu,trivikram,pooja hegde,tarakaratna  మహేష్-త్రివిక్రమ్ తప్పు చేస్తున్నారా?
Is Mahesh-Trivikram doing wrong? మహేష్-త్రివిక్రమ్ తప్పు చేస్తున్నారా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోతున్న SSMB28 పూజా కార్యక్రమాలతో మొదలైన ఇంకా ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే జూన్ నుండి SSMB 28 రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా మహేష్ చెప్పారు, త్రివిక్రమ్ కూడా SSMB28 ప్రీ ప్రొడక్షన్ తో బిజీ అయ్యారు. అటు మహేష్ కూల్ గా ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ ఫర్మ్ అయిన పూజ హెగ్డే వరస ప్లాప్స్ తో ఉంది. సో హీరోయిన్ ని మారిస్తే బావుంటుంది అనేది మహేష్ ఫాన్స్ కోరిక. కానీ త్రివిక్రమ్ మాత్రం పూజ హెగ్డే ని మర్చేదేలేదు అంటారు. అది ఓకె. కానీ ఇప్పుడు ఎలాంటి ఫేమ్, క్రేజ్ లేని నందమూరి హీరోని SSMB28 లో భాగం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది మహేష్ ఫాన్స్ మదిలో తొలుస్తున్న ప్రశ్న.

నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న గత కొన్నేళ్లుగా సక్సెస్ అవడానికి తపన పడుతున్న హీరో. మధ్యలో చాలారోజులు సినిమాలకి దూరంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు 9 అవర్స్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ తారక రత్న కి క్రేజ్ లేకుండా మహేష్ మూవీలో విలన్ గానో, లేదంటే కేరెక్టర్ ఆర్టిస్ట్ గానో తీసుకుంటే సినిమాపై అంచనాలు రావు. మరి త్రివిక్రమ్ - మహేష్ ఈ విషయంలో ఆలోచిస్తే బావుంటుంది అంటూ మహేష్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Is Mahesh-Trivikram doing wrong?:

SSMB28 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ