Advertisementt

అనిల్ రావిపూడికి అంతా అలా కలిసొచ్చేస్తుంది

Sat 28th May 2022 09:49 PM
anil ravipudi,patas,raja the great,supreame,f2,sarileru neekevvaru,f3  అనిల్ రావిపూడికి అంతా అలా కలిసొచ్చేస్తుంది
Anil Ravipudi is all about that అనిల్ రావిపూడికి అంతా అలా కలిసొచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

నిజంగా టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి నక్క తోక తొక్కడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం హైలెట్ అయ్యింది. పటాస్ దగ్గర నుండి F3 వరకు అనిల్ రావిపూడి సినిమాలు యావరేజ్ గా అయినా నిలిచాయి కానీ ప్లాప్ మాత్రం అవ్వలేదు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరూ, ఇప్పుడు F3 వరకు సక్సెస్ ఫుల్ గా తన జర్నీ కొనసాగిస్తున్నాడు ఆయన. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసి మరీ సినిమాలను విజయ తీరానికి చేరుస్తున్నారు.. నిర్మాతలు ముఖ్యగా ఆయన ఫెవెరెట్ నిర్మాత దిల్ రాజు ని శాటిస్ ఫై చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ కలయికలో F2 కి సీక్వెల్ గా తెరకెక్కిన F3 నిన్న శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. వెంకీ పాత్రకి అనిల్ రావిపూడి ఇచ్చిన డైలాగ్స్, ఫన్నీ  సీన్స్ అన్ని వర్కౌట్ అవడంతో సినిమా కి హిట్ టాక్ పడిపోయింది. నవ్వుల ఫ్రాంచైజీ అంటూ ప్రమోట్ చెయ్యడం, సినిమాకి హిట్ టాక్ పడినాక సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ దిల్ రాజు, అనిల్ రావిపూడి, హీరోలు వెంకీ, వరుణ్ లు చేస్తున్న హడావుడితో F3 పై ఆడియన్స్ లో ఆత్రుత మరింతగా పెరిగిపోవడంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో, ఆడియన్స్ తో కళకళలాడుతుంటే బాక్సాఫీసు దగ్గర కాసులు గలగలలు వినిపిస్తున్నాయి. మరి సరిలేరు నీకెవ్వరూ సినిమానే అనిల్ రావిపూడి స్టార్ హీరోతో చేసాడు. మిగతా వాళ్ళంతా పేరున్న హీరోలే అయినా.. అనిల్ రావిపూడి అన్ని అలా కలిసొచ్చేసి హిట్స్ కొట్టేస్తున్నారు. 

Anil Ravipudi is all about that:

Successful director in Anil ravipudi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ