కెజిఎఫ్ 2 సంచలన విజయంతో.. దానికి సీక్వెల్ గా రాబోతున్న KGF 3 పై అంచనాలు పెరిగినా.. కెజిఎఫ్ 3 ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఆ సినిమా నిర్మాత ఒకరు అక్టోబర్ నుండి షూటింగ్ అన్నా.. మరో నిర్మాత ఇప్పట్లో KGF3 షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు అంటూ కన్ఫ్యూజ్ చేసారు. అయితే కెజిఎఫ్ ని మాములుగా ముగించిన ప్రశాంత్ నీల్ KGF2 కి బాలీవుడ్ హంగులు అద్దారు. సంజయ్ దత్, రవీనా టాండన్ ని ఇంక్లూడ్ చేసాడు. ఇక KGF 3 లోనూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించే ఛాన్స్ ఉంది అని, హృతిక్ కోసం KGF చిత్ర బృందం ఆయన్ని సంప్రదించే పనిలో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో KGF నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పందిస్తూ..
KGF3 కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అసలు KGF 3 ఈ ఏడాది ఉండే ఛాన్స్ లేదని, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ తో బిజీగా వున్నారని, మరోపక్క యశ్ కూడా త్వరలోనే తన కొత్త సినిమాని ప్రకటించబోతున్నాడని, అటు ప్రశాంత్ నీల్-ఇటు యశ్ ఫ్రీ అయ్యాక KGF3 పనులు మొదలు పెడతామని, ప్రస్తుతానికి KGF3 గురించి పక్కనబెట్టామని, KGF3 పనులు మొదలయ్యాక అందులో ఎవరెవరు నటిస్తున్నారో అనేది అధికారికంగా ప్రకటిస్తామని విజయ్ తేల్చేసారు.