గత ఏడాది అక్టోబర్ లో బాలీవుడ్ లో పెద్ద కుదుపు. అదేమిటంటే బడా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీస్ లకి దొరికిపోయి కొన్నాళ్ళు జైలు జీవితం గడపడం. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఆర్యన్ ఖాన్ కి చిప్ప కూడు తినిపించారు జైలు అధికారులు. షారుఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇప్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తే కానీ.. ఆర్యాన్ ఖాన్ బెయిల్ పై బయటికి రాలేదు. ఆర్యన్ ఖాన్ కూడా దాదాపు 28 రోజుల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. జుహీ చావ్లా పూచి కత్తులతో ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి వచ్చినా.. తరచూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చెయ్యాలనే కండిషన్ మీద బయటికి వచ్చాడు.
తర్వాత సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 06 నవంబర్ 2021న విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆర్యాన్ ఖాన్ ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ SIT డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్ అవ్వడంతో సినీ ఇండస్ట్రీలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు నెటిజెన్స్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు 28 రోజులు జైల్లో ఉండి విచారణ ఎదుర్కున్న ఆర్యన్ ఖాన్ కి ఈ కేసులో క్లీన్ చిట్ రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.