ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటూ ప్రాంతీయ భాషల్లో తెరకెక్కిన మూవీస్ చాలావరకు ఆయా భాషల ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. అందులో ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ లాంటి చిత్రాలను పాన్ ఇండియా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అయితే హీరో సిద్దార్థ్ పాన్ ఇండియా అనే పదమే ట్రాష్ అని, అవి ఇండియన్ మూవీస్ అని, పాన్ ఇండియా పదం లేదంటున్నారు. ఇక తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ పాన్ ఇండియా మూవీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు చాలా సినిమాలను పాన్ ఇండియా మూవీస్ అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ గతంలో సౌత్ మూవీస్ చాలావరకు డబ్ అయ్యి హిందీలో టీవీల్లో వచ్చేవి. వాటిని నార్త్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారు.
కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ తెరకెక్కి అవి థియేటర్స్ లో రిలీజ్ అవడం వలన వాటిని చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈమధ్యన ఓ మూవీ అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ అన్ని భాషల వారు చూసే వీలుంటుంది. అందుకే ఇప్పుడు సినిమాకి భాష లేదు. సినిమా అంటేనే ఎమోషన్ అంటుంది రకుల్. అంతేకాకుండా హీరోయిన్స్ అందరిలా తానూ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ అవ్వాలంటే ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా డిజిటల్ ఎంట్రీ ఇస్తా అంటుంది.. ఓటీటీలో కూడా మంచి కంటెంట్ వస్తోంది అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్.