RC15 పై అదిరిపోయే న్యూస్

interesting news on RC15

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాకముందే కోలీవుడ్ శంకర్ తో RC15 షూటింగ్ మొదలు పెట్టేసారు. రీసెంట్ గానే RC15 వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్ అండ్ చరణ్ తదుపరి షెడ్యూల్ మారేడుమిల్లు లో ప్లాన్ చేస్తున్నారు. అయితే RC15 షూటింగ్ మొదలైనప్పటినుండి ఆ సినిమా సెట్స్ నుండి చరణ్ లుక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ స్టూడెంట్ లుక్ ఒకటి, అలాగే సైకిల్ మీద చరణ్ వైట్ అండ్ వైట్ లుంగీలో కనిపించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నారని టాక్ ఉంది.

అయితే ఇప్పుడు తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయం మాత్రమే కాదు, ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఒకటి తండ్రి పాత్ర కాగా.. ఇద్దరు కొడుకుల పాత్రల్లో చరణ్ నటిస్తున్నాడని, అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో కూడా ఉంటుందని సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తుంది. శంకర్ మాస్ దర్శకత్వానికి రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ పెరఫార్మెన్స్ అన్ని సినిమా కి హైలెట్ అవ్వబోతున్నాయని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ కనిపిస్తుంటే.. చరణ్ నెగెటివ్ రోల్ కి అంజలి హీరోయిన్ గా కనిపించబోతుంది అని అంటున్నారు. ఇక RC15 లో చరణ్ ట్రిపుల్ రోల్ న్యూస్ విన్న మెగా ఫాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.

Ram Charan RC15 update

ram charan
rc15
rc15 update
shankar
kiara advani
anjali