ఈ ఏడాది మొత్తం సోషల్ మీడియాలో బిగ్ బాస్ బిగ్ బాస్ అనే మాటే వినిపించేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఆగష్టు, సెప్టెంబర్ లో మొదలయ్యే బిగ్ బాస్ ఈఏడాది ఫిబ్రవరిలోనే నాన్ స్టాప్ అంటూ మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నడవడమే కాదు, రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ పూర్తయ్యింది కూడా. ఇక మళ్ళీ మరో బిగ్ బాస్ కి స్టార్ మా రంగం చేస్తుంది. అది బిగ్ బాస్ సీజన్ సిక్స్. ఇప్పటివరకు బిగ్ బాస్ లో కేవలం సెలబ్రిటీస్ మాత్రమే పాల్గొంటున్నారు. మధ్యలో సామాన్యులకి అవకాశం అన్నప్పటికీ.. వారు ఏదో ఒక చిన్న సినిమాలో నటించినవారే ఉండేవారు.
అయితే ఇప్పుడు సీజన్ సిక్స్ లో మాత్రం సామాన్యులు బిగ్ బాస్ లోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్ మా ఓ ప్రోమో వదిలింది. స్టార్ మా మీకు అందిస్తోంది వన్ టైం గోల్డెన్ ఛాన్స్.. అంటూ నాగార్జున బిగ్ బాస్ లోకి సామాన్యులను ఆహ్వానిస్తూ ప్రోమో వదిలారు. సామాన్యులు ఆకాశంలో ఎగరడానికి బిగ్ బాస్ వారి వెబ్సైట్ కి వెళ్ళి ముందుగా పేరు, జెండర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకునేవారు అలా పేరు అన్ని రిజిస్టర్ చేసుకున్నాక మూడు నిమిషాల నిడివి గల ఒక ఆడిషన్ వీడియో సిద్ధం చేసి బిగ్ బాస్ కి పంపాలి. ఇలా సామాన్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది అన్నమాట..