Advertisementt

బాలయ్యకి జోడిగా ప్రియమణి?

Thu 26th May 2022 04:52 PM
priyamani,anil ravipudi,balakrishna,anil ravipudi- balakrishna movie  బాలయ్యకి జోడిగా ప్రియమణి?
Priyamani in talks for NBK 108 బాలయ్యకి జోడిగా ప్రియమణి?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఇప్పుడు యంగ్ హీరోయిన్ శృతి హాసన్ తో జోడి కడుతున్నారు. NBK107 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యంగ్ బాలయ్య కేరెక్టర్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ లేకపోయినా ఐటెం గర్ల్ ఉంది. ఇక బాలయ్య నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఉండదేమో.. ఆయన నడి వయస్సు పాత్రలో ఓ కూతురికి తండ్రిగా నటిస్తారని ఆ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడంతో అందరూ అనుకున్నారు. కానీ బాలయ్య కి ఓ హీరోయిన్ ఉంటుందట. ఈమధ్యన సీనియర్ హీరో వెంకీ కి నారప్ప తో హిట్ ఇచ్చిన ప్రియమణి ఇప్పుడు బాలయ్యకి హీరోయిన్ గా అనిల్ రావిపూడి సినిమాలో నటించబోతుంది అంటున్నారు. 

ప్రియామణి నటించిన విరాట పర్వం రిలీజ్ కి రెడీ అవుతుండగా.. ఆమె నటించిన పాన్ ఇండియా వెబ్ సీరియస్ ఫ్యామిలీ మాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. సో సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన ప్రియమణి ఇప్పుడు బాలయ్య సినిమాలో నటిస్తుంది అంటే బాలయ్య ఫాన్స్ హ్యాపీ గా ఫీలవుతుంటే.. మరోపక్క బాలయ్య తో ప్రియమణి డిజాస్టర్ మూవీ లో నటించింది. సో ఆమె బాలయ్యకి ప్లాప్ ఇస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు. బాలకృష్ణ - ప్రియమణి గతంలో మిత్రుడు అనే డిసాస్టర్ మూవీలో నటించారు. అది ఆ కొంతమంది భయం అన్నమాట.

Priyamani in talks for NBK 108:

Priyamani final in Anil Ravipudi- Balakrishna movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ