Advertisementt

హరి హర వీరమల్లుపై ఆ న్యూస్ నిజమేనా

Thu 26th May 2022 03:06 PM
pawan kalyan,hari hara veera mallu,krish,a. m. ratnam  హరి హర వీరమల్లుపై ఆ న్యూస్ నిజమేనా
Pawan Kalyan disappointed Hari hara Veeramallu script హరి హర వీరమల్లుపై ఆ న్యూస్ నిజమేనా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా ఈమధ్యనే షూట్ రెస్యూమ్స్ అంటూ పవన్ కళ్యాణ్ యుద్ధ విద్యలు నేర్చుకుని మరీ సెట్స్ లోకి అడుగుపెట్టిన ఫొటోస్ వైరల్ కూడా అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తోట తరణి వేసిన సెట్స్ లో వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటూనే మధ్యలో ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆక్టివ్ గా కనబడుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు స్క్రిప్ట్ పై అసంతృప్తిగా ఉన్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ క్రిష్ స్క్రిప్ట్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారనే న్యూస్ అటు పవన్ ఫాన్స్ లోను అలజడి సృష్టిస్తుంది. 

ఇందులో ఎంత నిజముందో కానీ.. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ అయితే ఆగింది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి క్రిష్ దర్శకత్వంలో వీరమల్లుగా పవన్ లుక్ కి విశేషం స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం చాలా రకాల కాస్ట్లీ సెట్స్ కూడా వేశారు. వీరమల్లు గా పవన్ వీడియో కూడా హైలెట్ అయ్యింది. పవన్ సరసన నటిస్తున్న నిధి అగర్వాల్ లుక్ కూడా పాపులర్ గానే నిలిచింది. విలన్ గా అర్జున్ రామ్ పాల్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా 50 శాతం పూర్తయ్యింది. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పై ఈ నెగెటివ్ వార్తలేమిటో అనేది ఎవరికీ ముఖ్యంగా ఫాన్స్ కి ఏం అర్ధం కావడం లేదు.

Pawan Kalyan disappointed Hari hara Veeramallu script:

Pawan Kalyan Upset With Hari Hara Veera Mallu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ