ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kamal Haasan Vikram Receives U/A Certificate,

విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో మాసివ్ రిలీజ్

Kamal Haasan Vikram Receives U/A Certificate,

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో అలరించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇప్పటికే  ట్రైలర్‌తో ప్రమోషన్‌ల జోరు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో  400+ థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది.

ఇదీలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.

Kamal Haasan Vikram Receives U/A Certificate, Grand Release Through Sreshth Movies In Telugu States In 400+ Theatres

kamal haasan
vikram movie
vikram u/a certificate sreshth movies
telugu states 4