Advertisementt

విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో మాసివ్ రిలీజ్

Thu 26th May 2022 02:45 PM
kamal haasan,vikram movie,vikram u/a certificate sreshth movies,telugu states 4  విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో మాసివ్ రిలీజ్
Kamal Haasan Vikram Receives U/A Certificate, విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో మాసివ్ రిలీజ్
Advertisement
Ads by CJ

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో అలరించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇప్పటికే  ట్రైలర్‌తో ప్రమోషన్‌ల జోరు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో  400+ థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది.

ఇదీలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.

Kamal Haasan Vikram Receives U/A Certificate,:

Kamal Haasan Vikram Receives U/A Certificate, Grand Release Through Sreshth Movies In Telugu States In 400+ Theatres

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ