కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఈమధ్యన తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. గతంలో అంటే సినిమాలతో బిజీగా ఉంటూ హైలెట్ అయిన అమల ప్రస్తుతం ఒకటో రెండో ప్రాజెక్ట్స్ తో కొద్దిగా బిజీ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ చూపించేస్తుంది. తమిళ దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్నాక కెరీర్ లో బిజీగా మారిన అమల పాల్ తర్వాత డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి పలు వెబ్ సీరీస్ ల్లో నటించింది, నటిస్తుంది. కాకపోతే అమలాపాల్ కి ఓ అని చెప్పుకునే ఆఫర్స్ రావడం లేదు.
అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమధ్యన బీచ్ ఒడ్డున, నీటిలో బోటింగ్ చేస్తూ, సరదాగా ఉన్న పడవపై విచిత్రమైన డ్రెస్‌తో బాటమ్ అందాలు చూపిస్తూ ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమల పాల్ బీచ్ అందాల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ అమలా.. సోషల్ మీడియా హడావిడేనా.. లేదంటే సినిమాలేమైనా ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.