రవితేజ ఖిలాడీ డిసాస్టర్ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో రామ రావు ఆన్ డ్యూటీ మూవీ చేస్తున్నారు. రామ్ రావు ఆన్ డ్యూటీలో రామారావు గా గవర్నమెంట్ ఆఫీసర్ గా రవితేజ కనిపించబోతున్నారు. అయితే ఎప్పుడో ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ 17న థియేట్రికల్ విడుదలకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా పడింది అంటున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు మేకర్స్.. అంటూ అప్ డేట్ కూడా ఇచ్చారు. బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన అవుట్ ఫుట్ తీసుకురావడానికి దర్శకుడు కష్ట పడుతున్నాడని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినా.. ఇంకా బెటర్ అవుట్ ఫుట్ కోసం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
మరోపక్క సోషల్ మీడియాలో రవితేజ వలనే సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అని, నిర్మాత కి రవితేజ కి మధ్యన రెమ్యునరేషన్ డీలింగ్ ఇంకా సెట్ కానందునే ఈ సినిమా వాయిదా వెయ్యాల్సి వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కారణం బయటపెట్టలేక పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవడం మూలంగా రామారావు ఆన్ డ్యూటీని మేకర్స్ పోస్ట్ పోన్ చేసారు అంటున్నారు. ఏది నిజమో త్వరలోనే తెలిసిపోతుంది.