Advertisementt

కరణ్ జోహార్ పార్టీలో రష్మిక-విజయ్ ?

Wed 25th May 2022 10:02 PM
vijay devarakonda,rashmika mandanna,karan johar birthday party,karan johar,tollywood  కరణ్ జోహార్ పార్టీలో రష్మిక-విజయ్ ?
Karan Johar 50th Birthday Bash కరణ్ జోహార్ పార్టీలో రష్మిక-విజయ్ ?
Advertisement
Ads by CJ

ముంబై లో బడా కింగ్ మేకర్ కరణ జోహార్ ఇంట్లో జరిగే పార్టీల గురించి స్పెషల్ గా చెప్పుకునే అవసరం లేదు. చిన్న ఫెస్టివల్ అయినా, బర్త్ డే పార్టీలైనా, స్టార్స్ కిడ్స్ లంచ్ పార్టీలైనా, అలాగే వీకెండ్ పార్టీస్ అయినా ఎంతో గొప్పగా చేస్తుంటారు కరణ్ జోహార్. ఈ పార్టీలకి బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ కచ్చితంగా హాజరవ్వాల్సిందే. ఇక ఈమధ్యన లైగర్ మూవీ కి ప్రొడ్యూస్ చెయ్యడం స్టార్ట్ చేసాక కరణ్ జోహార్ పార్టీలో విజయ్ దేవరకొండ కూడా మెరుస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ఖుషి షూటింగ్ ఓ లాంగ్ షెడ్యూల్ ని కశ్మీర్ లో ముగించేసిన విజయ్ దేవరకొండ ముంబైలో తేలాడు. అక్కడ అనన్య పాండేతో లంచ్ పార్టీకి జాయిన్ అయ్యాడు.

కరణ్ జోహార్ తన 50 వ బర్త్ డే వేడుకలని ఓ బిగ్ పార్టీతో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు బుధవారం సాయంత్రం కరణ్ జోహార్ ఇంటి దగ్గర జరుగుతున్న పార్టీకి షారుక్‌ ఖాన్‌, ఆయన భార్య గౌరి ఖాన్‌, మలైకా ఆరోరా, అర్జున్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ లాంటి సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకి ఇన్విటేషన్ అందింది. మరి విజయ్ అంటే తరచూ కరణ్ తో మీట్ అవుతున్నాడు కాబట్టి ఇన్విటేషన్ వచ్చింది. కానీ విజయ్ ఫ్రెండ్, బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రశ్మికకి కూడా కరణ్ పార్టీకి ఇన్విటేషన్ రావడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. అంటే టాలీవుడ్ నుండి విజయ్ అండ్ రష్మిక కి తప్ప మరెవ్వరికీ ఈ పార్టీకి ఆహ్వానం లేదు అని.. అందుకే వీరిద్దరూ ఇప్పుడు ఈ పార్టీ విషయంలో సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు.

Karan Johar 50th Birthday Bash:

Vijay Devarakonda, Rashmika Mandanna Attends Karan Johar Birthday Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ