Advertisementt

విజయ్ అంటే నాకు అంతిష్టం: రష్మిక

Wed 25th May 2022 07:25 PM
rashmika mandanna,vijay,amitabh,thalapathy66,vamsi paidipally  విజయ్ అంటే నాకు అంతిష్టం: రష్మిక
Rashmika on working with Vijay విజయ్ అంటే నాకు అంతిష్టం: రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఇప్పుడు ఏ భాషలో చూసినా ఈ లక్కీ హీరోయిన్ పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు ఎవ్వరైనా రష్మిక ఫస్ట్ చాయిస్ అంటున్నారట. తెలుగులో పుష్ప పాన్ ఇండియా మూవీ తో భారీలో హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు పార్ట్ 2 లోను నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అమితాబచ్చన్ మూవీ.. ఇలా పలు రకాల ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా వున్న రష్మిక కి తమిళంలో బంపర్ ఆఫర్ తగిలింది. అది #Thalapathy66 లో విజయ్ సరసన నటించడం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రష్మిక విజయ్ కి జోడిగా కనిపించబోతుంది. రీసెంట్ గానే #Thalapathy66 షూటింగ్ లో జాయిన్ అయిన రష్మిక విజయ్ తో వర్క్ చేయడంపై తెగ ఎగ్జైట్ అవుతుంది. అటు బాలీవుడ్ లో అమితాబచ్చన్ లాంటి నటులతో నటించడం, ఇటు విజయ్ కలిసి చేస్తున్న సినిమా పై రష్మిక ఇంట్రెస్టింగ్ గా స్పందించింది.

చాలా గొప్ప నటులైన విజయ్, అమితాబచ్చన్ లాంటి హీరోల సినిమాల్లో నటించడం నిజంగా నా అదృష్టం. అంతా దేవుడి దయ. ఆయా హీరోలతో పని చేస్తునందుకు గర్వంగా ఫీలవుతున్నా. వారు నటిస్తున్న కథలు కూడా గొప్పవే. ఇంత పెద్ద నటుల నుండి ఎన్నో నేర్చుకుంటున్నా అని చెప్పిన రష్మిక.. నాకు చిన్నప్పటినుండి హీరో విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. వంశి సినిమాలో విజయ్ పక్కన నేనే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాక నా అదృష్టానికి నేను మురిసిపోయాను. #Thalapathy66 ఓపెనింగ్ లో విజయ్ ని అలా చూస్తుండి పోయాను. అంతే కాదు అక్కడే ఉన్న విజయ్ కి దిష్టి కూడా తీసాను. నేను అలా చేస్తుంటే విజయ్ షాక్ అవ్వగా.. సెట్ లో వారంతా గట్టిగా నవ్వేశారు విజయ్ అంటే నాకు అంతిష్టం అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

Rashmika on working with Vijay:

Rashmika Mandanna on working with Vijay and Amitabh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ