Advertisementt

లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: థ్యాంక్యూ

Wed 25th May 2022 05:38 PM
naga chaitanya,raashi khanna,thank you movie,thank you teaser,dil raju,vikram kumar  లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: థ్యాంక్యూ
Thank You teaser released లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: థ్యాంక్యూ
Advertisement
Ads by CJ

అక్కినేని నాగ చైతన్య కహీరోగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. మనం సినిమాతో చైతూకు మెమొరబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ థ్యాంక్యూ చిత్రంతో మరో గుర్తుండిపోయే సినిమా చేస్తున్నారు. విజయాలకు చిరునామాగా మారిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటున్న థ్యాంక్యూ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం సినిమా టీజర్ ను విడుదల చేశారు. 

థ్యాంక్యూ టీజర్ చూస్తే...బిజినెస్ టైకూన్ అభిరామ్ పాత్రలో నాగ చైతన్య కనిపిస్తున్నారు. ఓ సాధారణ కుర్రాడి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగినట్లు చూపించారు. ఈ ప్రయాణంలో అతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. గెలుపు పరుగులో తనతో తానే, తనకు తానే అయ్యాడు. నువు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్ లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు అని నాయిక మాటలు నేపథ్యంగా వినిపిస్తున్నాయి. ఆ మాటలే అభిరామ్ లో మార్పు తీసుకొచ్చాయి. అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే ..అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఓ సక్సెస్ ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరిని సినిమా చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

Thank You teaser released:

Naga Chaitanya Thank You teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ