నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నామినేషన్స్ విషయంలో బిందు మాధవితో తరచూ గొడవ పడడమే కాదు, ఒక సమయంలో బిందు పెంపకంలో బిందు ఫాదర్ ఫెయిల్ అయ్యారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. దానితో చివరి వారంలో ఫైనల్స్ లోకి అడుగుపెట్టాల్సిన నటరాజ్ మాస్టర్ లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బయటికి వచ్చాక కూడా పలు ఇంటర్వూస్ లో బిందు మాధవి పిఆర్ టీమ్స్ వలనే టైటిల్ గెలిచింది అని, ఆమె భాగోతం బయటపెడతా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. బిందు మాధవి తమిళ బిగ్ బాస్ అప్పుడు, ఈ బిగ్ బాస్ అప్పుడు పీఆర్ టీమ్స్ ని మెయింటింగ్ చేసి సోషల్ మీడియాలో ఆమె ఆడపులి టాగ్ తగిలించుకుని మరీ హైలెట్ అవుతూ దొంగ ఓట్స్ తో చివరికి బిగ్ బాస్ టైటిల్ కొట్టేసింది అంటూ నటరాజ్ ఆరోపిస్తున్నాడు.
అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. మిత్ర టాప్ 5 కి వెళ్ళడానికి, బిందు మాధవి టైటిల్ విన్ అవడానికి ఈ పీఆర్ టీం లు గట్టిగా పని చేశాయని తెలుస్తుంది. మరోపక్క అఖిల్, శివ, స్రవంతి, అరియనా లాంటివాళ్లు పిఆర్ టీం తోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారని అంటున్నారు.
అయితే నటరాజ్ మాస్టర్ ఆరోపణలపై బిందు మాధవి ఫాదర్ కౌంటర్ వేస్తున్నారు. బిందు మాధవి ఎలాంటి పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చెయ్యలేదు అని, ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది అని, అందుకే విన్ అయ్యింది అని చెప్పిన ఆయన నటరాజ్ మాస్టర్ అంటే ఏమిటో ప్రపంచం మొత్తం చూసింది. ఆయన హౌస్ లో ఎలా బిహేవ్ చేసారో అందరికి తెలుసు. ఆయన బిగ్ బాస్ ఫైనల్స్ కి వచ్చినప్పుడు నా దగ్గరకి వచ్చి సర్ నేను తప్పుగా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడు.. సరే నాయనా అంటూ నేను ఏం మాట్లాడలేదు. అలాంటి నటరాజ్ మాస్టర్ బిందు మాధవిపై చేసే ఆరోపణలు అవాస్తవాలంటూ ఆయన కొట్టి పారేసారు.