గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి సహజీవనం చేస్తున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ లు అతి త్వరలోనే అంటే జూన్ 9 నే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఇలానే కొన్ని డేట్స్ లో నయనతార పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా అవన్నీ చివరికి రూమర్స్ గానే మిగిలిపోయాయి. కానీ ఈసారి పక్కాగా నయనతార పెళ్లి పీటలెక్కబోతుంది అని, అది కూడా తిరుపతి లో శ్రీవారి సన్నిధిలో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకోబోతుంది అని అంటున్నా.. అధికారికంగా ఇంకా నయన్ కానీ, విగ్నేష్ కానీ పెళ్లి విషయమై స్పందించలేదు.
కానీ నయనతార మాత్రం తన పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది అని, ఇప్పటికే ఆమె తమ కులదైవం గుడిలో పూజలు నిర్వహించినట్లుగా ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యిది. విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార కుల దైవం కొలువై ఉన్న తంజావూరులోని పాపనాశంలో మేల్ మరతురు గ్రామంలో అమ్మవారు ఆలయాన్ని సందర్శించారని.. ఈ అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని.. దర్శకుడు విఘ్నేష్ శివన్ - నయనతార పొంగలి పెట్టి పూజలు చేశారని వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి పనులని ప్రారంభించినా ఈ జంట ఇంతవరకు ఆ విషయం మాత్రం అధికారికంగా తెలియజెయ్యకుండా సీక్రెట్ ని మెయంటెన్ చేస్తున్నారు.