ట్రిపుల్ ఆర్ లో ఇలా ఒక్కొక్కటిగా కాదు భీం.. కుంభ స్థలాన్ని బద్దలు కొడదాం రా అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ని సలార్ మేకర్స్ తెగ వాడేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో సలార్ రెస్యూమ్ షూట్ మొదలయ్యింది. సలార్ షూట్ మొదలవ్వగానే సెట్స్ లోని ప్రభాస్ లుక్ లీకైపోయింది. దానితో ప్రభాస్ ఫాన్స్ రెచ్చిపోయి వాటిని వైరల్ చేసారు. ప్రస్తుతం పాన్ ఇండియాలోనే విపరీతమైన క్రేజ్ ఉన్న మూవీ సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ పై ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు.
రీసెంట్ గా సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ సలార్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారడమే కాదు ప్రభాస్ ఫాన్స్ లో ఊపు తీసుకువచ్చాయి. సలార్ కోసం భారీస్థాయిలో టార్గెట్స్ అన్ని సెట్ చేశామ.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ప్రభాస్, సెకెండ్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ డైరెక్టర్ ప్రశాంతో నీల్ డెడ్లీ కాంబినేషన్ సెట్ అయినప్పుడే సలార్ అందరిముందు అతి పెద్ద సవాల్‌గా మారిందన్న ఆయన.. ప్రభాస్ ఫాన్స్, మాస్ ఆడియన్స్ అంచనాలు అందుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా సలార్ మూవీతో కుంభస్థలాన్ని బద్దలు కొడతామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఇక జూన్ మొదటి వారంలో సలార్ టీజర్ ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ అప్పుడే సలార్ ని ట్రెండ్ చెయ్యడానికి అలెర్ట్ అవుతున్నారు.