F2 లో తమన్నా, మెహ్రీన్ కౌర్ లు ఇద్దరే హీరోయిన్స్. వెంకీ, వరుణ్ తేజ్ లతో హారిక, హాని కేరెక్టర్స్ బాగా ఆడుకుంటాయి. ఇక F2 కి సీక్వెల్ అంటున్న F3 లో F2 కి మించి ఫన్ ని జనరేట్ చేసారు అనే విషయం F3 ట్రైలర్ లోనే చూపించారు. వెంకీకి రే చీకటి, వరుణ్ తేజ్ కి నత్తి, తమన్నా, మెహ్రీన్ కౌర్ ల మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అన్ని కేరెక్టర్స్ తో ఫన్ జనరేట్ అయ్యేలా చూసారు అనిల్ రావిపూడి. అయితే F3 కి మరో అదనపు ఆకర్షణ గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహన్. F3 ట్రైలర్ లోను సోనాల్ ని జస్ట్ సింగిల్ సీన్ కే పరిమితం చేసారు. సోనాల్ చౌహన్ కూడా F3 ప్రమోషన్స్ మిస్ అవకుండా మీడియా లో ఫోకస్ అవుతుంది.
అయితే సోనాల్ కేరెక్టర్ F3లో ఎలా ఉండబోతుందో అనే ఆత్రుత ఉంది. కానీ అనిల్ రావిపూడి మాత్రం సోనాల్ చౌహన్ కేరెక్టర్ F3 లో ఎలా ఉంటుందో అడగొద్దు అంటున్నారు. సోనాల్ కేరెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని, ఆమె కేరెక్టర్ ఖచ్చితంగా హైలెట్ అవుతుంది కానీ.. ఆమె కేరెక్టర్ గురించి ఏ విషయము బయట పెట్టను సినిమా చూసి ఆస్వాదించాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. దానితో సోనాల్ కేరెక్టర్ పై మరింత క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది ఆడియన్స్ లో.