కోలీవుడ్ హీరో శింబు ఫాదర్ టి రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురి కాగా చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. గత కొన్నాళ్లుగా శింబు తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో.. కుటుంబ సభ్యులు ఆయనని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. డాక్టర్స్ ఆధ్వర్యంలో రాజేంద్రర్ కి ట్రీట్‌మెంట్ జరుగుతున్నది అని ప్రస్తుతం రాజేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని సన్నిహితులు మీడియాకి తెలియజేసారు. అయితే రాజేందర్ ఆరోగ్యం పట్ల శింబు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
అందుకే తండ్రిని వెంటనే సింగపూర్ తీసుకెళ్లి అక్కడ అడ్వాన్స్ టెక్నలాజి ట్రీట్మెంట్ ఇప్పించాలని శింబు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తండ్రి రాజేందర్ ని శింబు సింగపూర్ తరలించే ఏర్పాట్లలోనే ఉన్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక శింబు తమిళ బిగ్ బాస్ ఓటిటికి హోస్ట్ గాను, ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నారు. తండ్రి ఆరోగ్యం కుదుట పడేవరకు శింబు ఇవన్నీ పక్కనబెట్టనున్ననట్లుగా తెలుస్తుంది.