నిన్న ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన అసందర్భ వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫాన్స్ మండి పడుతున్నారు. ఎమ్యెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసారంటూ టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున రచ్చ చెయ్యడం, పోలీస్ లు అనంత బాబుని అదుపులోకి తీసుకోవడంతో ప్రెస్ మీట్ పెట్టిన అంబటి రాంబాబు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ లు పై విమర్శలు గుప్పించడంతో పాటుగా మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గురించి నెగెటివ్ కామెంట్స్ చెయ్యడం ఎన్టీఆర్ ఫాన్స్ కి నచ్చడం లేదు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, ట్రోల్స్‌తో ఊగిపోతున్నారు. #JaganShouldApologizeJrNTR అనే హాష్ ట్యాగ్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఏపీ కి పట్టిన శని, దరిద్రం చంద్రబాబు, లోకేష్ అని సంచలనంగా మాట్లాడిన అంబటి రాంబాబు మధ్యలో లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఎద్దేవా చేసారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ అంబటి రాంబాబు పై ఆగ్రహం తో ఊగిపోవడమే కాదు, సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు పై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ అతను గతంలో మహిళతో మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డ్ ని ట్రెండ్ చెయ్యడమే కాదు, పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ తన సినిమాలేవో తాను చేసుకుంటున్న ఎన్టీఆర్ ని పాలిటిక్స్ లోకి లాగి నీచమైన కామెంట్స్ చేస్తే ఊరుకోమంటూ అంబటికి వార్నింగ్ ఇస్తూనే #JaganShouldApologizeJrNTR హాష్ టాగ్ ని ట్రేండింగ్ లోకి తెచ్చారు ఎన్టీఆర్ ఫాన్స్.