బిగ్ బాస్ లో మొదటిసారి ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యి బిగ్ బాస్ ట్రోఫీ ని అందుకోవడం తెలుగు నాన్ స్టాప్ లోనే జరిగింది. బిగ్ బాస్ టైటిల్ ని అందుకుని బిందు మాధవి చరిత్ర సృష్టించడం అందరికి హ్యాపీగానే ఉంది కానీ ఒక్కరు మాత్రం సహించలేకపోతున్నారు. వారే బిగ్ బాస్ హౌస్ లో బిందు మాధవితో తరచూ గొడవ పెట్టుకున్న నటరాజ్ మాస్టర్. నామినేషన్స్ విషయంలో ప్రతి వారము నటరాజ్ మాస్టర్ కి, బిందు మాధవికి పెద్ద రచ్చే జరిగేది. ఇక ఫైనల్ కి వెళ్లాల్సిన నటరాజ్ మాస్టర్ బిందు తో గొడవ వలనే లాస్ట్ వీక్ లో లాస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిందు మాధవి కాకుండా అఖిల్ విన్నర్ అవుతాడనుకున్న నటరాజ్ కి బిందు విన్నర్ అయ్యేసరికి ఆయనకి నోట మాటరాలేదు. ఓ వెర్రి నవ్వు నవ్వేసి.. టాస్క్ పెరఫార్మెన్స్ లేని వారు ట్రోఫీ ఎలా గెలిచారో అంటూ పిచ్చి నవ్వు నవ్వాడు.
ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. బిందు మాధవి టాస్క్ లు ఆడకపోయినా ఆమె పీఆర్ టీం మానేజ్ చేసి ఆమెని హైలెట్ చేసింది అని, అలాగే ఆడపులి టాగ్ ఆమె ముందే పెట్టుకుని ఎనిమిదో వారంలో సోషల్ మీడియాలో అప్లై చేసింది అని, అందుకే ఆమె ఫాన్స్ బిందు మాధవి-ఆడపులి అంటూ పబ్లిసిటీ చేసారని, సదరు యాంకర్ సోషల్ మీడియా అకౌంట్ మేనేజ్ చేయడం కోసమే కదా అని ప్రశ్నించగా.. దానికి నటరాజ్ మాస్టర్ నీతిగా నిజాయితీగా ఆడితే అలా చేయడం కరెక్ట్ ఏ అని ఆయన చెప్పుకొచ్చారు. బిందు మాధవికి ఆమె పిఆర్ టీం దొంగ ఓట్స్ వేయించింది అని, ఆమె బాత్ రూమ్ లో సిగరెట్ తాగేది అని, బిందు వాళ్ళ టీం సభ్యులు కలిసి మాట్లాడుకున్న స్క్రీన్షాట్స్ తన దగ్గర ఉన్నాయని కావాలంటే ఇంటర్వ్యూ అయ్యాక చూపిస్తా అంటూ నటరాజ్ సంచలనంగా మాట్లాడాడు.
ఆమె హౌస్ లో ఏమీ చేయకపోయినా ఆమెకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అని పిఆర్ టీం కష్టపడింది అని, కానీ నేను అదంతా బట్టబయలు చేసేలా మాట్లాడుతున్నాను అందుకే వాళ్లు నా మీద పగ బట్టి ఉండవచ్చు అని, నేను హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగానే ఆమె ఫాన్స్ నన్ను రాళ్లతో కొట్టడానికి ట్రై చేసారంటూ నటరాజ్ సంచలన కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మరింది.