ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా అల్లు ఫాన్స్ vs మెగా ఫాన్స్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. గతంలో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ ఇష్యు దగ్గర నుండి అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటూ.. ఇతర హీరోలతో స్నేహం చేస్తూ మెగా నుండి సపరేట్ కుంపటి పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని అన్నారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ, మెగా ఫాన్స్ అంతా అల్లు ఫ్యామిలీకి అల్లు హీరోలకి కాస్త దూరం జరగాలనుకుంటున్నారు కాబట్టే మెగా ఫాన్స్ లో ఇలాంటి చీలికలు అంటున్నారు. విజయవాడ మెగా ఫాన్స్ మీటింగ్ లో అల్లు vs మెగా అన్నట్టుగా మారింది పరిస్థితి.
దానితో అల్లు అర్జున్ ని సపోర్ట్ చేర్తుసూ ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడమే కాదు.. ఇప్పుడు మమ్మల్ని ఏం పీకలేరు అన్నట్టుగా సోషల్ మీడియాలో #EmPeekaleruBrother హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ అల్లు అర్జున్ కి నందమూరి హీరోల సపోర్ట్ ఉంది అని, ఇంకా నార్త్ లో విడుదలై డిసాస్టర్ అయిన మెగా హీరోల సినిమాల పోస్టర్స్ పెట్టి హడావిడి మొదలు పెట్టారు. నార్త్ లో రామ్ చరణ్ జంజీర్ డిసాస్టర్ అని, అలాగే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ నార్త్ లో అట్టర్ ప్లాప్ అని, చిరంజీవి సైరా నరసింహ రెడ్డి కూడా నార్త్ లో పోయింది అని, కానీ అల్లు అర్జున్ పుష్ప నార్త్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మమ్మల్ని #EmPeekaleruBrother అంటూ హాష్ టాగ్స్ తో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాన్స్ హడావిడి మొదలు పెట్టారు.