నిన్న సోమవారం విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషి మూవీ షూటింగ్ కశ్మీర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వస్తున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. ఖుషి సెట్స్ లో టీం మొత్తం సరదాగా చేసుకున్న డిన్నర్ పార్టీ పిక్ ని వదులుతూ మరీ టీం అప్ డేట్ ఇచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ-సమంతలు ప్రేమికులుగా కనిపిస్తారని, ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, సమంతలు చాలా కలర్ ఫుల్ గా కనిపించారు కూడా. 30 రోజుల పాటు కశ్మీర్ షెడ్యూల్ ఎంతో సరదాగా సాగింది అంటూ శివ నిర్వాణ ట్వీట్ చెయ్యడం, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ అంటూ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.
అయితే సడన్ గా ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.. అంటూ ఖుషి పిఆర్ టీం విజయ్ దేవరకొండ - సమంత లపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.