త్రివిక్రమ్ తాను తెరకెక్కించే సినిమాలకు 'అ' అనే అక్షరంతో టైటిల్ పెడుతుంటారు. అతడు, అ.. ఆ, అరవింద సమేత, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో.. ఇలా ఆయనకి 'అ' అనే అక్షరం బాగా కలిసొచ్చింది. అందుకే ఎక్కువగా 'అ' అనే అక్షరంతో మొదలయ్యేలా టైటిల్ ప్లాన్ చేస్తుంటారు. ఇక మహేష్ బాబు తో అతడు, ఖలేజా లాంటి ఫన్నీ మూవీస్ తెరకెక్కించిన త్రివిక్రమ్ మళ్ళీ 12 ఏళ్ళకి మహేష్ తో హ్యాట్రిక్ మూవీ చెయ్యబోతున్నారు. జూన్ నుండి త్రివిక్రమ్-మహేష్ మూవీ పట్టాలెక్కనుంది. మరి త్రివిక్రమ్ సినిమాలన్నీ చాలా కాస్ట్లీ గా, కథ మొత్తం డబ్బు చుట్టూ తిరిగేలా ఉంటాయి మహేష్ తో కూడా త్రివిక్రమ్ ఓ కాష్ట్లీ కథని రెడీ చేశారనే టాక్ ఉంది.
అయితే ఈ సినిమాకి పార్థు అనే టైటిల్ పెట్టబోతున్నారని అన్నా.. ఇప్పుడు మహేష్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే మూవీ కి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథకు సెట్టయ్యే విధంగా త్రివిక్రమ్ అ సెంటిమెంట్ తోనే మహేష్ ని అర్జునుడు అనే టైటిల్ తో చూపెట్టబోతున్నారని అంటున్నారు. అర్జునిడి టైటిల్ ని మహేష్ తండ్రిగారు కృష్ణ బర్త్ డే రోజునే రివీల్ చేస్తారని.. ఈ టైటిల్ తో పాటుగా మహేష్ లుక్ కూడా వదిలే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అప్పుడే తన పని మొదలు పెట్టేశారని తెలుస్తుంది.