Advertisementt

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడా..?

Mon 23rd May 2022 11:24 AM
zabardast,extra zabardast,sudigaali sudheer,etv,sudher fans  సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడా..?
Shocking news for Sudher fans సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడా..?
Advertisement
Ads by CJ

గత శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ మిస్ అయ్యాడు. అంతేకాదు, గెటప్ శ్రీను కూడా లేకుండా ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చేసేసాడు. దానికి ఎక్స్ట్రా జబర్దస్త్ కి గెస్ట్ గా వచ్చిన అనిల్ రావిపూడి నీ వీల్స్ లేకుండా ఫస్ట్ టైం స్కిట్ చేసావ్ ఎలా ఉంది అని అడగగానే రామ్ ప్రసాద్ శ్రీను, సుధీర్ బ్రేక్ తీసుకున్నారని చెప్పాడు. కొద్దిగా వాళ్లిద్దరూ బ్రేక్ తీసుకోవడంతోనే నేను సింగిల్ గా స్కిట్ చేశా అన్నాడు. అయితే సుధీర్ కూడా ఆది లాగే జబర్దస్త్ కి దూరమయ్యే ప్లాన్ లోనే ఉన్నాడేమో అంటూ ఆయన ఫాన్స్ కంగారు పడుతున్నారు.

ఎందుకంటే ఇప్పటికే సుధీర్ ఢీ డాన్స్ షో కి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మెల్లగా జబర్దస్త్ కి కూడా దూరమయ్యే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు. కారణం ఏం లేదు స్టార్ మా లో సుధీర్ సూపర్ సింగర్  జూనియర్స్ కి హోస్ట్ గా వస్తున్నాడు. అనసూయ తో కలిసి మరీ సుధీర్ ఆ షో ని నడిపిస్తున్నాడు ఈ ఆదివారమే స్టార్ మా లో సూపర్ సింగర్  జూనియర్స్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ షో లోను జూనియర్ సింగర్స్ చేత సుధీర్ కామెడీ చేస్తున్నాడు. సో అలా స్టార్ మా కి దగ్గరవుతున్న సుధీర్ జబర్దస్త్ కి దూరమవుతున్నాడేమో అనే అనుమానం అందరిలో మొదలైయింది. మరోపక్క హీరోగానూ సుధీర్ బిజీ. కాలింగ్ సహస్రా, గాలోడు.. ఇంకో ప్రాజెక్ట్ తో సుధీర్ బిజీగా వున్నాడు.

Shocking news for Sudher fans :

Did Sudheer get away with Zabardast..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ