బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిలిచి ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ గా ట్రోఫీ అందుకున్న బిందు మాధవి చరిత్ర సృష్టించింది. ఓ లేడీ కంటెస్టెంట్ టైటిల్ గెలవడం అనేది తెలుగులో ఇదే మొదటిసారి కావడంతో బిందు మాధవిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆమె టైటిల్ ని ఎంత కూల్ గా అందుకుందో అంతే కూల్ గా కెరీర్ లోను బిజీ అవ్వాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ తో పాటుగా 40 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకుంది. అసలైతే 50 లక్షల ప్రైజ్ అందుకోవాలి కానీ.. పది లక్షలు నాలుగో స్థానంలో ఉన్న అరియనా పట్టికెళ్లడంతో బిందు మాధవికి 40 లక్షలు దక్కాయి. అలా టైటిల్ తో పాటుగా 40 లక్షలు అందుకుంది బిందు మాధవి.
ఇక బిందు మాధవి బిగ్ బాస్ లో ఉన్నందుకు గాను వారానికి రెండు లక్షల చొప్పున పారితోషకం అందుకుంది అంటున్నారు. ఆమె హీరోయిన్ కాబట్టి క్రేజ్ ఉన్నా లేకపోయినా బిందు మాధవికి వారానికి రెండు లక్షల చొప్పున పారితోషకం బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలా 12 వారాలకు గాను బిందు మాధవి 24 లక్షల పారితోషకం అందుకుంది అని.. ఫైనల్ గా బిందు మాధవి అటు ట్రోఫీ అలాగే 40 లక్షల ప్రైజ్ మనీ, ఇటు 24 లక్షల పారితోషకం కలిపి 64 లక్షలు అందుకున్నట్లుగా సోషల్ మీడియా టాక్.