Advertisementt

బాలకృష్ణ కూతురిగా శ్రీలీల ఫిక్స్

Sun 22nd May 2022 09:11 PM
sree leela,balakrishna,anil ravipudi,nbk107,nbk107  బాలకృష్ణ కూతురిగా శ్రీలీల ఫిక్స్
Sree Leela to sizzle with Balakrishna బాలకృష్ణ కూతురిగా శ్రీలీల ఫిక్స్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఇప్పుడు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK107 లో నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలయ్య మాస్ సాంగ్ లో కాలు కదుపుతున్నారు. ఇక తర్వాత ఓ లాంగ్ షెడ్యూల్ ని అమెరికా లో ప్లాన్ చేసుకున్నారు గోపీచంద్. అయితే గోపీచంద్ మలినేని తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. గతంలో ఆయన బాలయ్య ని ఎవరూ చూపించని డిఫ్రెంట్ కేరెక్టర్ లో చూపిస్తాను అంటూ చెప్పారు. తాజాగా F3 ప్రమోషన్స్ లోను అనిల్ రావిపూడి బాలయ్య మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

బాలయ్య తో తాను చెయ్యబోయే సినిమా లో బాలయ్య నడి వయస్కుడిలా కనిపిస్తారని, తండ్రి కూతుళ్ళ కథగా ఈ మూవీ ఉంటుంది అని.. బాలకృష్ణ కి కూతురిగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల కనిపిస్తుంది అని చెప్పిన అనిల్.. సినిమా కథ మొత్తం బాలయ్య కేరెక్టర్ మీదే నడుస్తుంది అని, 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్ర ఎలా ఉంటుందో, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో అదే సినిమా అని, బాలయ్య బాబుని నేను వేరే కోణంలో చూస్తున్నా.. అదే సినిమాకి హైలెట్ అంటూ బాలయ్య సినిమాపై అనిల్ రావిపూడి అంచనాలు పెంచేశారు. 

Sree Leela to sizzle with Balakrishna:

Young actress Sree Leela for Balakrishna-Anil Ravipudi film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ