Advertisementt

రాజమౌళి మూవీపై మహేష్ కామెంట్స్

Sun 22nd May 2022 07:01 PM
mahesh babu,rajamouli movie,ssmb 28,trivikram,sarkaru vaari paata,mahesh - rajamouli combo  రాజమౌళి మూవీపై మహేష్ కామెంట్స్
Mahesh Babu comments on Rajamouli movie రాజమౌళి మూవీపై మహేష్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఆ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా అనుకుంటే.. మధ్యలోకి త్రివిక్రమ్ వచ్చారు. ఇక సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో SSMB28 చెయ్యాలి. అది పూర్తయ్యాక అంటే వచ్చే ఏడాది మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతారు. మహేష్ - రాజమౌళి కలయిక కోసం ఫాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్నది. అయితే మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు కానీ.. ఆయనతో కలిసి అంత హార్డ్ వర్క్ చెయ్యగలరా? మహేష్ చాలా స్మూత్ గా ఉంటారు, రాజమౌళితో అంటే చాలా కష్టపడాలి అనే అనుమానం ఫాన్స్ లో ఉంది. 

మహేష్ కూడా రాజమౌళి సినిమా విషయంలో ఎమన్నా స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ ఫీలవుతున్నారేమో అని అడగగా.. లేదు రాజమౌళి తో చెయ్యబోయే సినిమా కోసం ఎలాంటి ప్రెజర్ లేదు. కానీ తన వర్క్ పట్ల, రాజమౌళి సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అని, మేము ఎప్పుడు నుంచో సినిమా అనుకుంటున్నాం.. ఫైనల్ గా ఇప్పటికి ఆ సినిమా చెయ్యబోతున్నాము. అందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని మహేష్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్లారు.

Mahesh Babu comments on Rajamouli movie:

Mahesh Babu comments on Rajamouli movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ