Advertisementt

ఆగిన రాజ'శేఖర్' సినిమా

Sun 22nd May 2022 06:01 PM
stopped rajasekhar movie,sekhar movie,a. parandhama reddy,jevitha rajashekhar  ఆగిన రాజ'శేఖర్' సినిమా
Stopped Raja'Sekhar movie ఆగిన రాజ'శేఖర్' సినిమా
Advertisement
Ads by CJ

కోర్టు ఆదేశాల ప్రకారం జీవితగారు డబ్బు డిపాజిట్ చేయకపోవడం తో శేఖర్ సినిమా ప్రదర్శన ఆగింది -ఎ.పరంధామరెడ్డి

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా ప్రదర్శన అన్ని ప్రాంతాలలో ఆగిపోయింది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రదర్శనలను కోర్టు ఆదేశాలను అనుసరించి థియేటర్ల వారు ఆదివారం నిలుపుదల చేశారని ఫైనాన్షియర్గ్ ఎ.పరంధామరెడ్డి,తెలిపారు. తన దగ్గర Rs. 65,00,000 (అరవై ఐదు లక్షల రూపాయలు) అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో తాను హైదరాబాద్ లోని గౌరవనీయ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించానని, ఆ మేరకు 48 గంటల లోగా అగా ఆదివారం సాయంత్రం 4-30 గంటలు లోగా Rs. 65,00,000 (అరవై ఐదు లక్షల రూపాయలు) సెక్యూరిటీ డిపాజిట్ కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని, ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో శేఖర్ సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్ మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమా తోపాటు ట్రైలర్స్, పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పరంధామరెడ్డి వివరించారు.

కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా శేఖర్ సినిమాను ప్రదర్శిస్తే CONTEMPT OF COURT అవుతుందని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. ఇక ఈ చిత్రం నిర్మాతను తాను అని, సినిమాకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తానని బీరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి చెబుతున్నారు, కానీ ఈ విషయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను తాను లీగల్ గానే తేల్చుకోదలచుకున్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పరంధామరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి, శేఖర్ సినిమా ప్రదర్శనలను నిలుపుదల చేసిన థియేటర్స్ వారికి, డిజిటల్ ప్రొవైడర్స్ వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Stopped Raja'Sekhar movie:

Shekhar stopped showing the film as per court orders

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ