థియేటర్స్ క్లోజ్ అవడంతో కరోనా పాండమిక్ టైం లో చాలా సినిమాలు నేరుగా ఓటిటి నుండి రిలీజ్ అవడం, అలాగే సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకి ఓటిటిలో వస్తుండడంతో.. చాలామంది పేరున్న ఓటిటి లకి సబ్ స్క్రయిబ్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ 5 ఇలా చాలామంది ఓటిటీలకు అలవాటై వాటిని కొనేశారు ఓకె. థియేటర్స్ లో చూడని వారు ఓటిటిలో సినిమా చూడొచ్చు, అలాగే బోలెడన్ని వెబ్ సీరీస్ లు ఆ ఓటిటీలలో అందుబాటులో ఉంటాయని అనుకున్నారు. తీరా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొత్త సినిమా ఎర్లీగా ప్రీమియర్స్ చూడాలంటే 199 చెల్లించాలి అంటూ కెజిఎఫ్ ని అమెజాన్ ప్రైమ్ లో పెట్టారు. ఓటిటికి ప్రతి ఏడాది 1000 కట్టి మళ్ళి ఇలా ఎర్లి ప్రీమియర్స్ కోసం 199 చెల్లించడం ఏమిటి అంటూ చిరాకు పడుతున్నారు నెటిజెన్స్.
థియేటర్స్ లో మూవీ చూడడం మిస్ అయితే మళ్ళీ 199 కట్టడం అవసరమా? అది ఫ్రీ గా అందుబాటులోకి వచ్చాక చూడొచ్చులే అన్నట్టుగా అమెజాన్ ఆఫర్ ని లైట్ తీసుకున్నారు చాలామంది. మరి థియేటర్స్ లో పెరిగిన రేట్లు చెల్లించి, మళ్ళీ ఓటిటిలో ఫ్రీ గా చూడడానికి లేకుండా ఇలా డబ్బులు కట్టమంటే ఎవరూ కట్టరు. అందుకే ట్రిపుల్ ఆర్ మూవీ కూడా తగ్గి జీ5 లో డబ్బులు చెల్లించక్కర్లేకుండా ఫ్రీగా మూవీ చూడండి.. అంటూ ప్రకటించారు. లేదంటే అమెజాన్ ప్రైమ్ కి పడే దెబ్బే.. జీ 5 కి పడేది అంటూ ట్రోల్ చేస్తున్నారు.