బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈ శనివారం గ్రాండ్ ఫినాలే తో గ్రాండ్ గా ముగిసింది. 18 మంది కంటెస్టెంట్స్ కాస్తా.. టాప్ లో 7 మెంబెర్స్ ఉండగా.. అందులో ఒక్కరు విన్నర్ గా నిలిచారు. నిన్న శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలే లో నాగార్జున విన్నర్ ని ప్రకటించారు. మేజర్ టీం ప్రమోషన్స్, F3 ప్రమోషన్స్, హీరోయిన్స్ గ్లామర్ డాన్స్ ల మధ్యన గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఇక హౌస్ లో ఉన్న టాప్ 7 లో ముందుగా అనిల్ బయటికిరాగా, తర్వాత బాబా వచ్చారు. తర్వాత ప్లేస్ లో మిత్ర శర్మ ఉంది. ఇక అరియనా 4 వ స్థానంలో ఉండి ఎలాగూ ఎలిమినేట్ అవుతానని తెలిసి పది లక్షల సూట్ కేసు పట్టుకుపోగా.. యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచాడు. అఖిల్ - బిందు మాధవి మధ్యలో టఫ్ ఫైట్ నడవగా ఫైనల్ గా బిందు మాధవి నాన్ స్టాప్ టైటిల్ గెలిచి ట్రోఫీ అందుకుని చరిత్ర సృష్టించింది.
అయితే ఫినాలే ముగియడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నుండి అభిమానులు ర్యాలీతో కార్ లో వెళ్లారు. అయితే యాంకర్ శివ మాత్రం కార్ ఓపెన్ డోర్ లో నించుని అభిమానులకి అభివాదం చెయ్యడంతో అభిమానులు ఒక్కసారిగా గుమ్మి గుడారు. దానితో పోలీస్ లు రంగ ప్రవేశం చేసి అభిమానులని చెల్లా చెదురు చెయ్యడమే కాదు, శివ కి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మీరు ఓపెన్ టాప్ ఎక్కకపోతే గనక ఫాన్స్ ఇలా చేసేవారు కాదు, మీరు ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని శివకి పోలీస్ లు చెప్పారని తెలుస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలా అభిమానులతో ర్యాలీ కోసం లక్షల్లో ఖర్చు పెట్టినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.