సీనియర్ హీరోలకి హీరోయిన్స్ దొరక్కపోవడం, సీనియర్ హీరోల సినిమా అవకాశాలు వస్తే వాటిని రిజెక్ట్ చేసే హీరోయిన్స్ ని చూసాం కానీ.. టాప్ హీరో, స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాని రిజెక్ట్ చేసే హీరోయిన్స్ ని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈమధ్యనే కొరటాల శివ - ఎన్టీఆర్ కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతున్న NTR30 లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది అన్నప్పటికీ.. తర్వాత అలియా భట్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్ళిపోయింది అనే న్యూస్ నడుస్తున్నా టీం నుండి క్లారిటీ రావడం లేదు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ NTR30 వీడియో లోను అలియా భట్ ని కన్ ఫర్మ్ చెయ్యలేదు. సో ఆల్మోస్ట్ అలియా భట్ ఈప్రాజెక్టు లో లేనట్లే. అందులోను అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసేస్తుంది
ఇక తాజాగా ఎన్టీఆర్ తో నటించడానికి మరో బాలీవుడ్ బ్యూటీ ఒప్పుకోలేదని, NTR30 కోసం ఆమెని సంప్రదించగా ఆమె సున్నితంగా ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది అంటున్నారు. ఆమె ఎవరో కాదు ప్రాజెక్ట్ కె తో ప్రభాస్ తో ఫస్ట్ టైం సౌత్ కి ఎంట్రీ ఇస్తున్నది దీపికా పదుకొనె. అలియా భట్ కాదన్నాక కొరటాల టీం దీపికా పదుకొనేని సంప్రదించగా.. దీపికా కూడా NTR30 లో నటించలేను అని చెప్పేసినట్లుగా వార్తలు రావడంతో.. ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ గా డిస్పాయింట్ అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడానికి హీరోయిన్స్ రిజెక్ట్ చెయ్యడమేమిటా అని వారి ఆలోచన.