Advertisementt

పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అప్ డేట్

Sat 21st May 2022 08:41 PM
pawan kalyan,bhavadeeyudu bhagath singh update,bhavadeeyudu bhagath singh movie,harish shankar,harish shankar - pawan kalyan combo  పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అప్ డేట్
Bhavadeeyudu Bhagath Singh update పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అప్ డేట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్, అలాగే తెలంగాణ రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. రాజకీయాలంటూ రోడ్ షోస్ తో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గానే హరి హర వీరమల్లు రెస్యూమ్ షూట్ మొదలైంది. ఇక రాజకీయాల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు లుక్ లోనే అంటే లాంగ్ హెయిర్ తోనే కనిపిస్తున్నారు. ఇక హరి హర వీరమల్లు షూటింగ్ లేట్ అవుతూ ఉండడంతో ఈ సినిమా దసరాకి వచ్చే ఛాన్స్ లేదని.. వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తారని అంటున్నారు. అదలా ఉంటే.. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ మూవీ కూడా జూన్ నుండి మొదలు కాబోతుంది అని ఏప్రిల్ లోనే అప్ డేట్ ఇచ్చారు.

కానీ తాజాగా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్ ఆగష్టు నుండి పూజా కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అంటూ సోషల్ మీడియాలో అప్ డేట్ చూసిన ఫాన్స్ కొద్దిగా డిశ్పాయింట్ అవుతున్నారు. జూన్ లోనే వారి కాంబోలో పవర్ ఫుల్ మూవీ మొదలవుతుంది అనుకుంటే మరికాస్త వెనక్కి వెళ్ళింది అని వాళ్ళు ఫీలవుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టైలిష్ లుక్ ని ఫస్ట్ లుక్ లోనే రివీల్ చేసారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ అంటున్నారు. త్వరలోనే హీరోయిన్ పై అఫీషియల్ ప్రకటన రావొచ్చని టాక్.

Bhavadeeyudu Bhagath Singh update:

Pawan Kalyan Bhavadeeyudu Bhagath Singh update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ