నాకు తెలియకుండానే ఊపొచ్చేసింది: మహేష్

Mahesh Babu Funny Interview

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో మహేష్ ఫాన్స్ లో ఊపు తీసుకువచ్చింది. మే 12 న థియేటర్స్ లో రిలీజ్ అయిన సర్కారు వారి పాట రిలీజ్ కి ముందు మంచి బజ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక మహేష్ బాబు కూడా సర్కారు వారి పాటకి భారీ ప్రమోషన్స్ చెయ్యడమే కాదు, కర్నూల్ లో సర్కారు వారి పాట సెలెబ్రేషన్స్ లో మ.. మా.. మహేశా స్టేజ్ పై పాటకి డాన్స్ వేసి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే సర్కారు వారి పాట టీం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సర్కారు వారి పాట సెట్స్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ని పంచుకున్నారు. అందులో ముఖ్యంగా కీర్తి సురేష్ ఓ సీన్ లో నన్ను తిట్టాలి. కానీ పరశురామ్ గారు ఎన్నిసార్లు చెప్పిన కీర్తి సురేష్ నన్ను తిట్టడానికి భయపడింది. నేను ఏమవుతుంది తిట్టు అనగానే.. తర్వాత మీ ఫాన్స్ నన్ను ఊరుకోరు అంది కీర్తి సురేష్. పర్వాలేదు తిట్టమన్నా.. అప్పుడు చాలా టేక్స్ తర్వాత నన్ను తిట్టింది. సినిమాలో ఆ సీన్ చూసినప్పుడు సితార సోఫా నుండి కింద పడిపోయి మరీ నవ్వేసింది అంటూ మహేష్ ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

అంతేకాదు మీరు కర్నూల్ ఈవెంట్ లో స్టేజ్ పై డాన్స్ చెయ్యడం ఏమిటి? అలా ఎందుకు చేసారు? ముందే అనుకున్నారా అని అడిగితే.. అలా ఎందుకు జరిగిందో నాక్కూడా తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక మా టీం మొత్తం షాక్. అలా సర్ ప్రైజ్ అయ్యి చూస్తుండిపోయారు. రెండేళ్లు కష్టపడి చేసాం. దానికి అభిమానుల నుండి వస్తున్న స్పందన చూసాక నాలో ఊపొచ్చింది. దానితో స్టేజ్ పై డాన్స్ చేయాలనిపించింది.. అలా చేసేసాను అంటూ మహేష్ చెప్పడం ఆ ఇంటర్వ్యూకే హైలెట్ అయ్యింది.

Mahesh Babu Funny Interview about Sarkaru Vaari Paata Success

mahesh babu
keerty suresh
parasuram
mahesh funny interview
sarkaru vaari paata success interview