Advertisementt

బిగ్ బాస్ ఓటిటి ఫినాలే ప్రోమో హైలైట్స్

Sat 21st May 2022 12:37 PM
bigg boss telugu ott,bigg boss,bigg boss non stop,bigg boss grand finale,nagarjuna,major team,mehreen kaur dance,f3 team  బిగ్ బాస్ ఓటిటి ఫినాలే ప్రోమో హైలైట్స్
Bigg Boss Telugu OTT: Finale Promo Highlights బిగ్ బాస్ ఓటిటి ఫినాలే ప్రోమో హైలైట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే కి సమయం ఆసన్నమైంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ఎలాంటి హైలెట్స్ ఉండబోతున్నాయి అనేది ప్రోమో రిలీజ్ చేసారు. ఈ రోజు బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారో అనేది సస్పెన్స్ గా లేకుండా సోషల్ మీడియా లీకులు బిగ్ బాస్ ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయినా గ్రాండ్ ఫైనల్స్ లో ఎవరు విన్ అవుతారో అనే క్యూరియాసిటీ లేకపోతేనేమి.. ఎంతమంది ఎంటర్టైన్ చెయ్యడానికి వస్తారు, ఏ సెలెబ్రిటీ డాన్స్ చేస్తుంది, ఏ మూవీ టీం సినిమాని ప్రమోట్ చెయ్యడానికి బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై మెరుస్తారు అనే ఆత్రుత అందరిలో ఉంటుంది. మరి ఈ రోజు నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై అందమైన హీరోయిన్స్ డాన్స్ లు, అలాగే పాన్ ఇండియా మూవీ టీమ్స్, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబొయె సినిమా టీమ్స్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన ప్రోమో ని రిలీజ్ చేసారు.

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న ఏడుగురు హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రాండ్ ఫినాలే కోసం తమ తమ సీట్స్ లో ఆసీనులయ్యారు. ఇక మెహ్రీన్ కౌర్ గ్లామర్ డాన్స్, అప్సర రాణి డాన్స్, దక్షా నాగర్కర్ బ్యూటిఫుల్ డాన్స్ లే కాకుండా మేజర్ టీం అంటే అడివి శేష్, సాయి మంజ్రేకర్ మేజర్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. అంతేకాకుండా F3 ప్రమోషన్స్ కోసం అనిల్ రావిపూడి సునీల్, మెహ్రీన్ కౌర్ లతో హౌస్ లోకి అడుగుపెట్టి ఫన్ చేసారు. ఇక హౌస్ మేట్స్ ఏడుగురిని నించోబెట్టి నాగార్జున కౌన్ డౌన్ స్టార్ట్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

Bigg Boss Telugu OTT: Finale Promo Highlights:

Bigg Boss Telugu Non Stop: Finale Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ