ఇప్పుడు కొరటాల శివ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా మీమర్స్ కూడా కొరటాల శివ పై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి కవ్విస్తున్నారు. ఇంతకీ కొరటాల అంతగా ట్రోల్ ఎందుకు అవుతున్నారంటే.. కొరటాల శివ ఆచార్య తర్వాత అల్లు అర్జున్ తో మూవీకి కమిట్ అయ్యారు. బన్నీ - కొరటాల మూవీ కి సంబందించిన లుక్ కూడా రిలీజ్ చేసారు. కానీ మధ్యలో కొరటాల - ఎన్టీఆర్ మూవీ తెరపైకి వచ్చింది. కొరటాల - బన్నీ మూవీ వెనక్కు వెళ్ళి NTR30 లైన్ లోకి వచ్చింది. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్ ని స్టైలిష్ గా చూపిస్తూ లుక్ రిలీజ్ చేసారు. అక్కడి వరకు బాగానే ఉంది.
కొరటాల ఆచార్య ముగించారు NTR30 కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా ఎన్టీఆర్ బర్త్ డే వచ్చింది.. దానితో NTR30 పై ఓ స్పెషల్ వీడియో చేసి పోస్టర్ కూడా వదిలారు. అయితే ఇక్కడ బన్నీ తో కొరటాల కాంబో పోస్టర్, ఎన్టీఆర్ తో కొరటాల మూవీ పోస్టర్ ఒకే మాదిరిగా ఉండడంతో కొరటాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బన్నీ కథతోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. బన్నీ కాన్సెప్ట్ తోనే ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది, అందుకే అలా సేమ్ పోస్టర్స్ ఉన్నాయని, బన్నీ పోస్టర్ లో పడవ ఇద్దరు మనుషులు నించున్న పోస్టర్ డిజైన్ చేస్తే.. ఎన్టీఆర్30 లో షిప్ పెట్టి నెత్తుటి మరకలతో ఒక్కడు నిల్చున్న పోస్టర్ ని డిజైన్ చేసారు. బన్నీ కథ నే ఎన్టీఆర్ కి మార్చి చెప్పి సినిమా కమిట్ చేయిస్తే చేయించు ఉండొచ్చు.. కానీ పోస్టర్ అయినా మార్చాల్సింది కొరటాలా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.