షాకింగ్: Top5 కోసం లంచం ఇచ్చిందా?
Bigg Boss Non Stop: Mithra Sharma Will Top 5 Contestantsబిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పటి నుండి హౌస్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ పై సీజన్ చివరి వరకు అందరిలో అనుమానాలు ఉండడమే కాదు, హౌస్ మేట్స్ అయితే షాకవుతున్నారు. ఆమె ఎవరో కాదు మహానటి, డ్రామా క్వీన్ టాగ్స్ తో హైలెట్ అయిన మిత్ర శర్మ. ఆమె హౌస్ లో ఎలా ఏం చేసిందో, ఆమెని బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఇంకా ఎలా కంటిన్యూ చేస్తున్నారో ఎవరికీ అర్ధమే కావడం లేదు. మిత్ర శర్మ స్ట్రాంగ్ కాదు.. అటు గ్లామర్ లేదు.. కానీ ఫైనల్స్ వరకు వచ్చేసింది. ఆమె ఇంట్లో ఉండి స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ మాత్రం ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. రీసెంట్ గా టాప్ నుండి కూడా మిత్ర శర్మ సేఫ్ అయ్యి బాబా భాస్కర్, అనిల్ నుండి ఎలిమినేట్ అవ్వగా.. మిత్ర శర్మ మాత్రం టాప్ 5 కి వెళ్ళింది. ఎంతగా మిత్ర శర్మకి పిఆర్ టీం పని చేసినా, ఆమె ఫాన్స్ గట్టి సపోర్ట్ ఇచ్చినా.. వరస నామినేషన్స్ నుండి ఎలిమినేట్ అవ్వకుండా తప్పించుకుని టాప్ 5 లో కాలు పెట్టిన మిత్ర శర్మ పై షాకింగ్ అలిగేషన్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే టాప్ 5 కాదు మిత్ర శర్మ టాప్ 3 లోనిలిచింది అనేది మరో షాకింగ్ న్యూస్. బిందు మాధవి టైటిల్ గెలుస్తుండగా, అఖిల్ రన్నర్ గా మిగిలాడు అని, టాప్ 3 మిత్ర శర్మ, టాప్ 4 యాంకర్ శివ అని, అరియనా టాప్ 5 లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే టాప్ 5 లో ఉండడానికి మిత్ర శర్మ బిగ్ బాస్ యాజమాన్యానికి లంచం ఇచ్చింది అని, మిత్ర శర్మ కేవలం క్రేజ్ కోసమే బిగ్ బాస్ లోకి వచ్చింది అని, ఆమెకి డబ్బు ఓ లెక్క కాదు అని, టాప్ 5 లో ఉంటే కాస్త క్రేజ్ వస్తుంది అని మిత్ర శర్మ తిరిగి బిగ్ బాస్ కి భారీగా లంచం ఇచ్చినట్లుగా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఆ న్యూస్ చూసి హాట్ స్టార్ లో బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు కూడా షాకవుతున్నారు.
Bigg Boss Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants






































