Advertisementt

చెల్లి పెళ్లి-అక్క డెలివరీ

Fri 20th May 2022 11:34 AM
actress sanjana galrani,baby boy,nikki galrani,aadi pinisetty  చెల్లి పెళ్లి-అక్క డెలివరీ
Sanjana Galrani Welcomes Baby Boy చెల్లి పెళ్లి-అక్క డెలివరీ
Advertisement
Ads by CJ

చెన్నై లో హీరోయిన్ నిక్కీ గల్రాని తన ప్రేమికుడు హీరో ఆది పిన్ని శెట్టి ని ఏప్రిల్ 18 అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిక్కీ గల్రాని కొన్నాళ్లుగా ఆది పినిశెట్టి ప్రేమలో ఉన్న నిక్కీ గల్రాని పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. ఆది ఫాన్స్, నిక్కీ గల్రాని ఫాన్స్ వారి పెళ్లితో ఖుషీగా ఉన్నారు. ఇక్కడ చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగితే అక్కడ అక్క సంజన గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంజన గల్రాని కర్ణాటకకు చెందిన అజీజ్‌ పాషా అనే డాక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రీసెంట్ గానే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టిన సంజనాకి ఈ నెలలోనే స్నేహితులు, సన్నిహితులు మధ్యన గ్రాండ్ గా శ్రీమంతం వేడుకలు జరిగాయి. ఇక నేడు సంజన గల్రాని పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది అని సంజనాని ట్రీట్ చేస్తున్న లేడీ డాక్టర్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్‌ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అది వైరల్ అయ్యింది. దానితో చెల్లెలి పెళ్లి-అక్క బిడ్డకి జన్మనిచ్చింది అంటూ గల్రాని ఫాన్స్ సంతోషంగా వున్నారు. 

Sanjana Galrani Welcomes Baby Boy:

Actress Sanjana Galrani blessed with a baby boy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ