గత రెండు మూడు నెలలుగా జబర్దస్త్ లో హైపర్ ఆది కానీ ఆయన టీం కానీ కనిపించడం లేదు. ఆది జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసాడనే టాక్ ఉంది. ఇక రోజా మంత్రి పదవి పొందాక ఆమె కూడా జబర్దస్త్ కి టాటా చెప్పేసింది. ఇక జబర్దస్త్ అంతా కొత్తగా కాదు.. కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త జేడ్జ్ లతో కనబడుతుంది. ఇంద్రజ, మను రెగ్యులర్ గా వస్తున్నా మధ్యలో పూర్ణ, శ్రద్ద దాస్, లైలా లాంటి వాళ్ళు జెడ్జెస్ గా కనిపిస్తున్నారు. ఇక స్పెషల్ స్కిట్స్ అంటూ ఏదో తిప్పలు పడుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం లో గెటప్ శ్రీను గత రెండు వారాలుగా కాన రావడం లేదు.
ఇక ఈ వారం సుధీర్ కూడా మిస్ అయ్యాడు. అంటే సుధీర్, శ్రీను లేకుండానే ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చెయ్యబోతుంటే.. ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన F3 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆటో రామ్ ప్రసాద్ నిన్నో మాట అడగనా అని ఆటోలో వీల్స్ లేకుండా ఫస్ట్ టైం స్కిట్ చేస్తున్న నీ ఫీలింగ్ ఎలా ఉంది అని సుధీర్, శ్రీను లేకపోవడంపై ప్రశ్న అడగగా.. దానికి రామ్ ప్రసాద్ కొద్దిగా కష్టమే సర్. వీళ్ళందరికీ స్కిట్ రాసి ఎక్సప్లయిన్ చేసి ప్రాక్టీస్ చేయించాలి. కానీ సుధీర్, శ్రీను ఉంటే.. బావ నీకి డైలాగ్, నీకీ డైలాగ్ అని చెప్పగానే వారు అల్లుకుపోతారు అంటూ కాస్త ఎమోషనల్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.