Advertisementt

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Thu 19th May 2022 10:35 AM
prabhas,salaar,salaar update,prashanth neel,kgf chapter 2  ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Good News for Prabhas fans ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. నిన్నటివరకు ప్రభాస్ ప్రోజెక్ట్ కె షూటింగ్ లో ఉన్నప్పటికీ.. ప్రభాస్ ఫాన్స్ అంతగా ఎగ్జైట్ అవ్వలేదు. కానీ ప్రభాస్ సలార్ అప్ డేట్ కోసం మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫాన్స్ సలార్ ని మాస్ రేంజ్ లో ఊహించేసుకుని మరింతగా ఎగ్జైట్ అవుతున్నారు. అందులోనూ సలార్ కెజిఎఫ్ కి రెండు రేట్లు మించి ఉంటుంది అనగానే ఫాన్స్ క్యూరియాసిటీలోకి వెళ్లిపోతున్నారు. మే మొదటి వారంలోనే సలార్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ వల్ల అది కాస్త లేట్ అయ్యింది.

అయితే సలార్ రెస్యూమ్ షూట్ ఈ నెల 24 న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మొదలు కాబోతుంది అని తెలిసాక ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు. #Prabhas, #Salaar, #PrashanthNeel హాష్ టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ సలార్ లో నటించే మెయిన్ కేరెక్టర్స్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. సలార్ అప్ డేట్ రావడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Good News for Prabhas fans:

Prabhas Salaar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ