Advertisementt

రేపటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోతారుగా

Thu 19th May 2022 10:08 AM
ntr fans,ntr 30,ntr 31,koratala shiva,prashanth neel,ntr birthday special  రేపటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోతారుగా
NTR to surprise fans with NTR 30, NTR 31 updates రేపటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోతారుగా
Advertisement
Ads by CJ

రేపటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోతారుగా 

రేపటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ ఫాన్స్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం కాచుకుని కూర్చున్నారు. స్టార్ హీరోలంతా ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగా వున్నా.. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు టైం వెచ్చించారు. అలాగే తదుపరి సినిమాల విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొరటాల శివ తో చేస్తున్న NTR30 నుండి ఓ లుక్ రిలీజ్ చేసాక మళ్లీ ఎలాంటి అప్ డేట్ ఎన్టీఆర్ కొత్త సినిమాల నుండి లేవు. కానీ రేపు మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే కి రెండు పాన్ ఇండియా అప్ డేట్స్ ఉండబోతున్నాయి. 

అందులో కొరటాల శివ సినిమా నుండి ఎన్టీఆర్ ఫోటో షూట్ వదలబోతున్నారు. NTR30 కోసం కొరటాల ఇప్పటికే ఫోటోషూట్ చేయించారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా ఫిలిం ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నారు. ప్రశాంత్ తో చేసే NTR31 నుండి ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్పెషల్ అప్ డేట్ ఉండబోతుంది. ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టించడానికి వేచి చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ - మైత్రి మూవీస్ మేకర్స్ లో బుచ్చి బాబు చెయ్యాల్సిన సినిమా నుండి అప్ డేట్ ఉంటుందో.. లేదో.. అనే చిన్న కన్ఫ్యూషన్ అయితే ఉంది. మెబి ఉండకపోవచ్చు అనేది ఫాన్స్ లో ఉన్న డౌట్.  

NTR to surprise fans with NTR 30, NTR 31 updates:

NTR Fans Are In For A Double Treat With NTR 30 & NTR 31

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ