Advertisementt

కేసీఆర్ ని కలిసిన కోలీవుడ్ హీరో విజయ్

Wed 18th May 2022 09:51 PM
actor vijay,kollywood hero,vamsi paidipalli,mp santosh kumar,telangana cm kcr,cm kcr  కేసీఆర్ ని కలిసిన కోలీవుడ్ హీరో విజయ్
Actor Vijay meets Telangana CM కేసీఆర్ ని కలిసిన కోలీవుడ్ హీరో విజయ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో Thalapathy 66 లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. విజయ్ కూడా హైదరాబాద్ లోనే ఈ షూటింగ్ కోసం స్తే చేసారు. అయితే విజయ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ ను అలాగే వంశి పైడిపల్లిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి మరీ కేసీఆర్ గారి దగ్గరకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు. అయితే విజయ్ కేసీఆర్ ని కలవడంతో మీడియా లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో ముఖ్యంగా విజయ్ కొన్నాళ్లుగా తన సినిమాల్లో బిజెపి ని వ్యతిరేకించడం, అలాగే కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో బిజీగా మారి, బిజెపి పై తీవ్ర విమర్శలు చెయ్యడంతో ఇప్పుడు కేసీఆర్ - విజయ్ కలయిక ఇంట్రెస్టింగ్ గా మారింది అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 

Actor Vijay meets Telangana CM :

Kollywood Actor Vijay meets Telangana CM KCR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ