Advertisementt

హిట్ కొట్టాడు.. లగ్జరీ కారు కొన్నాడు

Wed 18th May 2022 07:19 PM
vishwak sen,ashoka vanamlo arjuna kalyanam,range rover  హిట్ కొట్టాడు.. లగ్జరీ కారు కొన్నాడు
Vishwak Sen bought new luxury car హిట్ కొట్టాడు.. లగ్జరీ కారు కొన్నాడు
Advertisement
Ads by CJ

పాగల్ సినిమా నిరాశపరిచినా విశ్వక్ సేన్ మాత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం పై మాత్రం విపరీతమైన నమ్మకం పెట్టుకోవడమే కాదు, ఆ సినిమా ప్రమోషన్స్ ని చాలా గట్టిగా చేసాడు. మధ్యలో న్యూస్ ఛానల్ టివి 9 తో గొడవ పెట్టుకోవడం కూడా అర్జున కళ్యాణం ప్రేక్షకుల్లోకి గట్టిగా వెళ్ళడానికి ఉపయోగ పడింది అనే చెప్పాలి. విశ్వ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తాను అని పబ్లిక్ గానే చెప్పాడు. విశ్వక్ సేన్ నమ్మినట్టుగానే అశోక వనంలో అర్జున కళ్యాణ్ మంచి హిట్ అయ్యింది. దానితో విశ్వక్ సేన్ ఖుషి అయ్యాడు.

అయితే అర్జున్ కళ్యాణం సక్సెస్ ని ఆస్వాదిస్తున్న విశ్వక్ సేన్ కొత్త కారొకటి కొన్నాడు. తనకిష్టమైన బెంజ్‌ జీక్లాస్‌ 2022 మోడల్‌ కారుని ఏకంగా కోటిన్నర పెట్టి కొనెయ్యడమే కాదు, తనకి నచ్చిన, కల కన్న కారుని సొంతం చేసుకున్నట్లుగా చెప్పిన విశ్వక్ సేన్ ఇదంతా అభిమానుల వల్లే అని, మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉ‍న్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు విశ్వక్‌ సేన్. అయితే విశ్వక్ సేన్ కారు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే ఆయన ఫ్రెండ్ దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఆ కారు నాదే ఫొటోస్ దిగుతానంటే ఇచ్చాను అంటూ కామెంట్ చెయ్యడం కామెడీగా అనిపించింది. 

Vishwak Sen bought new luxury car:

Vishwak Sen bought a Range Rover

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ