Advertisementt

హడావిడి లేకుండా RC15 టైటిల్ వచ్చేస్తుందా?

Wed 18th May 2022 04:42 PM
rc15,rc15 title,ram charan,shankar,dil raju  హడావిడి లేకుండా RC15 టైటిల్ వచ్చేస్తుందా?
RC15 Title Grand Launch Tomorrow? హడావిడి లేకుండా RC15 టైటిల్ వచ్చేస్తుందా?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కలయికలో క్రేజీ మూవీ గా మూడు భాషల్లో తెరకెక్కుతున్న RC15 షూటింగ్ చిత్రీకరణకు చిన్న బ్రేక్ ఇచ్చారు. వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చరణ్ అండ్ శంకర్ లు హైదరాబాద్ ఇంకా మారేడుమిల్లులో ప్లాన్ చేసిన కొత్త షెడ్యూల్ కోసం చిన్న విరామం ఇచ్చారు. అయితే RC 15 మొదలు పెట్టిన రోజే శంకర్ తన స్టయిల్లో ఆ సినిమా పోస్టర్ ని డిజైన్ చేయించారు. ఈ సినిమాకి దిల్ రాజు భారీ బడ్జెట్ పెడుతున్నారు. అయితే శంకర్ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కి భారీ ఖర్చు పెట్టడం ఆయనకి అలవాటు. ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం, ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది.

అయితే RC 15 పై ఎలాంటి అప్ డేట్ లేకపోయినా చరణ్ ఫాన్స్ RC 15 ని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రెండ్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా RC 15 టైటిల్ పై ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఈ వారంలో కాదు రేపు సాయంత్రం 4.27 నిమిషాలకి RC 15 టైటిల్ రాబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి RC 15 టైటిల్ వస్తుంది అని ప్రచారం జరగడమే కానీ, యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన లేదు. అంటే అంత సైలెంట్ గా అయితే RC15 టైటిల్ ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం RC15 టైటిల్ రాబోతుంది అనే అంటున్నారు. మరి ఈ అప్ డేట్ విషయంలో టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

RC15 Title Grand Launch Tomorrow?:

RC15 Title Grand Launch Tomorrow 4:27 PM?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ