Advertisementt

మహేష్ ఫాన్స్ కి హీరోయిన్స్ కష్టాలు

Wed 18th May 2022 11:56 AM
mahesh babu,mahesh fans,keerty suresh,sarkaru vaari paata,ssmb 28,pooja hegde  మహేష్ ఫాన్స్ కి హీరోయిన్స్ కష్టాలు
Heroines are in trouble for Mahesh Fans మహేష్ ఫాన్స్ కి హీరోయిన్స్ కష్టాలు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఫాన్స్ సర్కారు వారి పాట హిట్ తో సంబరాలు చేసుకుంటున్నా వారికి మరో దిగులు పట్టుకుంది. అదే మహేష్ సరసన నటిస్తున్న హీరోయిన్స్ విషయంలో మహేష్ ఫాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేసున్నారు దర్శకులు. ఇంతకుముందు కళావతి కీర్తి సురేష్ విషయంలో తెగ టెంక్షన్ పడిపోయారు. అందమైన మహానటి చిక్కిపోయి కళావిహీనంగా తయారైంది అని. కానీ సినిమాలో మహేష్ అంత అందంగా లేకపోయినా, గ్లామర్ గా కాస్త బొద్దుగా బాగానే కనిపించింది. దానితో మహేష్ బాబు ఫాన్స్ కూల్ అయ్యారు. కానీ సినిమా షూటింగ్ లో ఉండి, రిలీజ్ టైం వరకు ఫాన్స్ లో ఆ కంగారు పోలేదు.

ఇక ఇప్పుడు SSMB28 లో మహేష్ బాబ సరసన నటిస్తున్న పూజ హెగ్డే విషయంలో ఆ టెంక్షన్ మరోసారి మొదలయ్యింది మహేష్ ఫాన్స్ లో. ఎందుకంటే పూజ హెగ్డే ఈ మధ్యనే హ్యాట్రిక్ ప్లాప్ అందుకుంది. రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీ, అలాగే తమిళంలో విజయ్ బీస్ట్, ఇంకా రీసెంట్ గా చిరు ఆచార్య తో మూడు వరస ప్లాప్స్ లో ఉన్న పూజ హెగ్డే మహేష్ సరసన నటిస్తుంది అనగానే వాళ్లలో గుబులు మొదలైంది. నిన్నటివరకు లక్కీ హీరోయిన్. కానీ ఇప్పుడు ఐరెన్ లెగ్ అంటున్న పూజ హెగ్డే మహేష్ తో కలిసి అంటే వాళ్ళు భయపడుతున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజ హెగ్డే నే మహేష్ పక్కన ఫైనల్ అంటున్నారట. సో ఇది మహేష్ ఫాన్స్ కి హీరోయిన్స్ కష్టాలు అంటే.

Heroines are in trouble for Mahesh Fans:

Whom will Mahesh romance in SSMB28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ