ప్రభాస్ గత కొన్నాళ్లుగా ఫామ్ ని కోల్పోయారు. బాహుబలి తర్వాత బాగా బరువు పెరిగి, ఏజెడ్ పర్సన్ గా ప్రభాస్ కనిపిస్తున్నారు. సాహో, నిన్నటి రాధే శ్యామ్ సినిమాల్లో ప్రభాస్ లుక్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ తీవ్రంగా డిస్పాయింట్ అయ్యారు. అవుతున్నారు. ప్రాజెక్ట్ కె లోను, ఆదిపురుష్ లోను ప్రభాస్ అదే బరువైన లుక్ తోనే కనిపిస్తారని ఫాన్స్ డిసైడ్ అయ్యారు. మధ్యలో ప్రభాస్ బరువు తగ్గడానికి ఓ ప్రముఖ జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కష్టపడుతున్నారని న్యూస్ నడిచినా ప్రభాస్ ఫిజిక్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పుడెప్పుడో ఓం రౌత్ ప్రభాస్ లుక్ చేంజ్ కోసం విదేశాలకు తీసుకెళ్లారనే న్యూస్ కూడా వినిపించింది. అయితే ఇప్పుడు ప్రభాస్ చెయ్యబోయే సలార్ కోసం ప్రశాంత్ నీల్ ఓ కండిషన్ పెట్టాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది ప్రభాస్ బాగా బరువు తగ్గి లుక్ లో చేంజ్ చూపించాకే సలార్ తదుపరి షెడ్యూల్ మొదలు పెడదామని ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ చెప్పినట్లుగా ఆ వార్త సారాంశం. మరి రేపో మాపో సలార్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అనుకుంటున్న ఫాన్స్ కి ఒకరకంగా ఇది షాకే. ఎందుకంటే ప్రభాస్ వెయిట్ లాస్ ప్రాసెస్ కి టైం పట్టేస్తుంది. మరి నిజంగానే ప్రశాంత్ నీల్ ఇలాంటి కండిషన్ పెట్టాడంటే చాలామందికి నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ మాస్ అవతార్ లో రెండు షెడ్యూల్స్ ని ప్రశాంత్ నీల్ పూర్తి చేసేసాడు. ఇలాంటి టైం లో ప్రభాస్ వెయిట్ పై ప్రశాంత్ నీల్ ఫోకస్ పెట్టాడనడం నమ్మ సఖ్యంగా లేదు అంటున్నారు.