బాలీవుడ్ లో రెబల్ గా కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. బాలీవుడ్ నేపోటిజం పై ఫైట్ చేసే కంగనా ఏ స్టార్ హీరోని లెక్క చెయ్యదు. బాలీవుడ్ బడా సెలెబ్రెటీస్ కి ఎదురెళ్లి మరీ కొట్లాడుతుంది. నాతో కలిసి నటించడానికి ఏ స్టార్ కూడా సాహసించరు అని చెబుతుంది కంగనా. ఈ మధ్యన సౌత్ హీరోలు సూపర్బ్ అని, బాలీవుడ్ స్టార్ కిడ్స్ బాయిలర్ కోళ్లు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక తాజాగా తన ఇంటికి ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ సెలబ్రిటీకి కానీ వచ్చే అర్హత లేదని కంగన రనౌత్ తీవ్రంగా స్పందించింది.
అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీస్ తనను ఎవరైనా బయట కలిస్తే పర్వాలేదని, కానీ ఏ బాలీవుడ్ సెలెబ్రిటీని తన ఇంటికి ఆహ్వానించనని చెప్పింది. కంగనా నటించిన ధాకడ్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ లో కంగనా ఏ హీరోకి తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో నటించింది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.