Advertisementt

బిగ్ బాస్: అఖిలే నెంబర్ 1

Wed 18th May 2022 10:01 AM
bigg boss,bigg boss non stop,akhil,bindu madhavi  బిగ్ బాస్: అఖిలే నెంబర్ 1
Bigg Boss Non Stop: Final week voting బిగ్ బాస్: అఖిలే నెంబర్ 1
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగియడానికి కేవలం మూడు రోజులే ఉంది. ఈ ఆదివారమే బిగ్ బాస్ ఓటిటి గ్రాండ్ ఫైనలేని ప్లాన్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఈసారి నాన్ స్టాప్ లో గ్రాండ్ ఫైనల్స్ లో 7 గురు అడుగుపెట్టబోతున్నారు. బాబా భాస్కర్, అఖిల్, బిందు, అరియనా, శివ, మిత్ర, అనిల్ లు ఫైనల్స్ కి చేరుకున్నారు. ఏడుగురు ఫినాలే లో ఉన్నప్పటికీ ఒక్కరికే బిగ్ బాస్ ట్రోఫీ వచ్చేది. ఇక ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీ అంటూ హౌస్ మేట్స్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. యాంకర్ శివ, అరియనా ల బిగ్ బాస్ జర్నీతో వారిద్దరూ ఎమోషనల్ అయిన ఎపిసోడ్ గత రాత్రి ప్రసారం అయ్యింది.

ఇక ఏడుగురు ఫైనల్స్ లో ఉంటే.. వారిలో బిందు మాధవి కి అఖిల్ కి ఓటింగ్ లో రోజు కొకరిని ఆడియన్స్ టాప్ లో ఉంచుతున్నారు. గత ఆదివారం రాత్రి నుండే మొదలైన ఓటింగ్ ఈ బుధవారంతోనే ముగిసిపోతుంది. బుధవారం రాత్రి 11.59 నిమిషాలతో బిగ్ బాస్ ఓటింగ్ లైన్ క్లోజ్ చేస్తారు. సోమవారం మొత్తం బిందు మాధవి టాప్ లో ఉంటే, మంగళ వారం అఖిల్ టాప్ లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ రోజు ఎవరు ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో నిలవబోతున్నారో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

అయితే మంగళవారం టాప్ పొజిషన్ లో ఉన్న అఖిలే ఈ రోజు కూడా టాప్ పొజిషన్ ని కంటిన్యూ చేస్తాడని, బిందు కి ఫైనల్ గా సెకండ్ ప్లేస్ మాత్రమే దక్కుతుంది అంటున్నారు. కాకపోతే వీరిమధ్యన ఓటింగ్ లో చాలా తక్కువ తేడా ఉన్నట్లుగా, ఈ రోజు గడిస్తేనే కానీ ఎవరు టాప్ లో ఉంటారో, ఎవరి పొజిషన్ మారినా ఆశ్చర్యపోయే పని లేదు అంటున్నారు. 

Bigg Boss Non Stop: Final week voting:

Bigg Boss Non Stop Finale Week Voting Results

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ